యూపిలో లాక్ డౌన్

లక్నో: ప్రజలు, హైకోర్టు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చర్యలు తీసుకోక తప్పలేదు. శుక్రవారం నుంచి మే 4వ తేదీ ఉదయం వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

రెండు రోజుల క్రితం అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసును విచారించింది. పరిస్థితి అదుపులోకి రానప్పుడు లాక్ డౌన్ విధించడమే మార్గమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కనీసం రెండు వారాల లాక్ డౌన్ విధించాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 29,824 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా, 266 మంది చనిపోయారు. లక్నో, వారణాసి, కాన్పూర్, మీరట్, అలహాబాద్, ఆగ్రా, గోరఖ్ పూర్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

Chief Minister Yogi Adityanathlatest telugu newsLock down in UPTelugu breaking newstelugu news