మార్పును తీసుకువద్దాం: కేఏ పాల్

హైదరాబాద్: రేపు జరగనున్న జీహెచ్ఎంసీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్ కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు డబ్బుకు, ప్రలోభాలకు అమ్ముడుపోవద్దని, ఈ ఎన్నికల ద్వారా మార్పును తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తుండగా పాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత కొన్ని రోజుల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా కేఏ పాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

latest telugu newsTelugu breaking newstelugu news