అశ్వాపురంలో పెద్దపులి కలకలం

భద్రాద్రి కొత్తగూడెం: గత కొన్ని రోజులుగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పెద్ద పులుల గాండ్రింపులు ఎక్కువౌతున్నాయి. తాజాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వపురం మండలంలో ఓ పెద్ద పులి స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది.

అందరూ చూస్తుండగానే ఓ పెద్దపులి స్థానిక పుష్కరవనం అడవి నుంచి బయటకు వచ్చి రోడ్డును దాటడంతో.. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్టు సిబ్బంది నిజంగానే పెద్ద పులి సంచరించినట్టుగా గుర్తించారు. పులిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu news