తెలంగాణలో ఆక్సిజన్, ఏపిలో రెమిడెసివర్ కొరత

హైదరాబాద్: తెలంగాణలో ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తున్నదని, అయినప్పటికీ సర్దుబాటు చేస్తున్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పొరుగున ఉన్న ఏపీలో మాత్రం రెమిడెసివర్ లభ్యం కావడం లేదు.

కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతుండడంతో అదే స్థాయిలో ఆక్సిజన్ కొరత కూడా పెరిగిందని మంత్రి రాజేందర్ అంగీకరించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తరువాత మంత్రి రాజేందర్ మాట్లాడుతూ, పాతిక సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ను కోరగా అంగీకరించారన్నారు. అయితే దానిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. వ్యాక్సిన్ కూడా డిమాండ్ కు తగ్గట్లుగా కేంద్రం సరఫరా చేయడం లేదన్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, ఇంటికి పరిమితం కావడం అత్యుత్తమం అని అని మంత్రి రాజేందర్ కోరారు.

ఏపీ లో రెమిడెసివర్ కొరత అధికంగా ఉన్నది. మార్కెట్ లో లభ్యం కాకపోవడంతో పలువురు బ్లాక్ మార్కెట్ లో నాలుగైదు రెట్లకు అధికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడలోని హెటిరో డ్రగ్స్ డీలర్ నుంచి కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. దీంతో డ్రగ్స్ అధికారులు అమ్మకాలను నిలిపివేయాలని డీలర్ ను ఆదేశించారు. పది రోజుల్లో మార్కెట్ లో అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ap drugs inspectorap latest newsblock marketinghetro drugs dealeroxygen cylinders shortageremdesivir shortage