నన్ను కాపాడండి అంటున్న ఖుష్బూ

బిజెపి నాయకురాలు, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ పెద్ద చిక్కుల్లో పడ్డారు. హ్యాకర్స్ ఆమెకు మరోసారి షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి బయటపడేందుకు పరిష్కార మార్గం చూపాలని బహిరంగంగా వినతి చేసింది.

ఖుష్బూ ట్విటర్ అక్కౌంట్ ను మళ్లీ హ్యాకర్స్ హ్యాక్ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ లో హ్యాక్ గు గురి కాగా తాజాగా మరోసారి చేశారు. ఈసారి ఆమె పేరును ఏకంగా బ్రియాన్ గా మార్చేశారు. ఆమె ప్రొఫైల్ ఫొటోను మార్చేసి ఫొటోలను కూడా తీసేశారు. గతంలో చేసిన పోస్టులను డిలీట్ చేశారు. మూడు రోజుల నుంచి పాస్ వర్డ్ మార్చేందుకు ప్రయత్నించగా అప్ డేట్ కావడం లేదు. ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేసినా ట్విటర్ నుంచి కూడా సరైన సమాధానం రావడం లేదు. పైగా ఆమె అక్కౌంట్ ను సస్పెండ్ చేస్తామని ట్విటర్ తెలియచేసింది కూడా. ఇక మార్గం లేక ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ ద్వారా ట్విటర్ అక్కౌంట్ హ్యాక్ అయిందని తెలియచేసింది. ఎవరైనా తనను ఈ సమస్య నుంచి కాపాడాలని ఖుష్బూ వేడుకున్నది.

latest telugu newsTelugu breaking newstelugu news