టీచర్ భార్యకు కు రూ.1 కోటి చెక్ ఇచ్చిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: టీచర్ గా అంకిత భావంతో పనిచేసిన నితిన్ తన్వర్ కుటుంబానికి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.1 కోట్టి ఎక్స్ గ్రేషియా చెక్ అందచేశారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసిన నితిన్ కరోనా సంక్షోమ సమయంలో అహర్నిషలు పనిచేశారని ఆయన కొనియాడారు.

ఆయన నివాసానికి కేజ్రీవాల్ వెళ్లి భార్య కు చెక్ అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ దుకాణంలో పనిచేస్తూ చనిపోయాడని కొనియాడారు. నితిన్ లాంటి వ్యక్తి మూలంగానే ఢిల్లీ మహమ్మారిన ఎదుర్కొగలదని అన్నారు. కరోనా పాజిటివ్ తో భర్త మరణిస్తే భార్యకు ప్రతినెలా రూ.2,500 ఫించన్, పెళ్లికాని మరణిస్తే తల్లిదండ్రులకు నెలవారి ఫించన్, తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తే వారి సంతానానికి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ఫించన్ ఇస్తామని సిఎం కెజ్రీవాల్ వెల్లడించారు.

Delhi CM Arvind Kejriwallatest telugu newsTelugu breaking newstelugu news