కరోనాపై రోజూ మూడుసార్లు సమీక్షలు: కేసీఆర్

హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు సమీక్షించి స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

రెమిడెసివర్ ఇంజెక్షన్లు మొదలు కరోనా వాక్సిన్ లు, ఆక్సిజన్, బెడ్ ల లభ్యత విషయంలో ఏ మాత్రం లోపం రానీయవద్దని సిఎం ప్రధాన కార్యదర్శి సోమేష్ ను సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సిఎం కార్యాలయం నుంచి సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని నియమించినట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ, చక్కగా పనిచేయాలని సిఎం సూచించారు.

cm kcrlatest telugu newsTelugu breaking newstelugu news