కేసీఆర్ ఏజెంట్లు టీఎన్జీఓలు: బండి సంజయ్

హైదరాబాద్: టీఎన్జీఓఎస్ నాయకులు సీఎం కేసీఆర్ కు ఏజెంట్లుగా మారారని, బాంచన్ దొర అంటూ భజన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు, డిమాండ్లపై ఉద్యమించకుండా కేసీఆర్ ఏది చెబితే అది చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాల నాయకులకు రైతుల సమస్యతో సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.

డీఏ, పీఆర్సీ గురించి ఉద్యమించకుండా కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలపై ఉద్యమించే హక్కు మీకెక్కడిదని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం టీఎన్జీఓఎస్ నాయకులు పత్రికా ప్రకటనలిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రైతుల రుణమాఫీ, కనీస మద్దతు ధర, సీఎం కేసీఆర్ పంట సాగు నియంత్రణ పై ఉద్యోగ సంఘాలు ఎందుకు నిలదీయడం లేదని బండి సంజయ్ అడిగారు.

latest telugu newsTelugu breaking newstelugu news