పవన్ వెంట చిరంజీవి రాబోతున్నాడు!: నాదెండ్ల

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట తన అన్న, కాంగ్రెస్ నేత చిరంజీవి త్వరలోనే రాబోతున్నారంటూ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కు చిరు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

రైతుల సమస్యలపై అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. పవన్ కు చిరు నైతిక మద్దతు ఉంటుందని మనోహర్ స్పష్టం చేశారు. నాదెండ్ల తాజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. తెరపైకి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. చిరు రీఎంట్రీపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏ ఉద్దేశంతో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారని ఆలోచనలో పడుతున్నారు.

Janasena leader Nadendla Manoharlatest telugu newsTelugu breaking newstelugu news