ప్రైవేటుకు వ్యాక్సిన్లు ఆపేయాలి: జగన్

అమరావతి: దేశంలో వ్యాక్సిన్ల కొరత అంటూనే ప్రైవేటు హాస్పిటళ్లకు ఎలా ఇస్తున్నారని, ఇలా ఇవ్వడం మూలంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

వ్యాక్సిన్లు, ప్రైవేటు హాస్పిటళ్లలో అధిక ధరల వసూళ్లపై జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు వ్యాక్సినేషన్ జరగాలని లేఖలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రైవేట్‌ హాస్పిటళ్లలో వ్యాక్సిన్లు ఇవ్వడం మూలంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపారు. కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని సిఎం జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వ్యాక్సిన్ల కొరతతో ప్రస్తుతం 45 ఏళ్ల వారికే ప్రాధాన్యం ఇస్తున్నాం. మీరు చెప్పిన ప్రకారం మేము 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించలేకపోయాం. ఇలాంటి స్థితిలో ప్రైవేట్‌ హాస్పిటళ్లకు వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదన్నారు.

ప్రైవేట్‌ హాస్పిటళ్లలో ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక్క డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైవేట్‌ లో వ్యాక్సినేషన్  వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రభుత్వ నియంత్రణ లేకుంటే నల్లబజారుకు తరలిస్తారు. సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం జరగాలని సిఎం జగన్, ప్రధాని మోదీని కోరారు.

AP CM YS Jagan Mohan Reddylatest telugu newsTelugu breaking newstelugu news