వ్యాక్సిన్ కొరత ఇప్పట్లో తీరదు: జగన్

తాడేపల్లి: కరోనాకు ఇప్పుడు కేవలం వాక్సినేషన్‌ మాత్రమే ఒక పరిష్కారంగా ఉంది.. వ్యాక్సిన్ కొరత సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియదని ఏపి సిఎం వైఎస్.జ‌గ‌న్ మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
కరోనా వ్యాక్సినేషన్ పై సిఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా, అందులో ఒక కోటి వాక్సిన్లు కోవాగ్జిన్ కాగా మిగిలినవి కోవీషీల్డ్‌ అన్నారు. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్‌ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలన్నారు. తొలి డోస్‌ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి వేయగా అందులో 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్‌ వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటి వరకు వేసిన వాక్సిన్‌ డోస్‌లు దాదాపు 15 కోట్లు మాత్రమేనన్నారు.

అంటే ఇంకా 39 కోట్ల వాక్సిన్‌ డోస్‌లు కావాలన్నారు. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా, సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వాక్సీన్లు తయారు చేస్తోందన్నారు. అన్నీ కలిపి ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్లు వాక్సిన్లు ఉత్పత్తి కావొచ్చు. దానికి తోడు ఇప్పుడున్న 7 కోట్లు కూడా కలుస్తాయన్నారు. ఈ లెక్కన 39 కోట్ల వాక్సిన్‌ డోసుల డిమాండ్‌ ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదన్నారు. ఆ తరువాతే 18 ఏళ్లు పైబడిన వారికి వేస్తారు. ఆ మేరకు వారికి వాక్సినేషన్‌ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుంది.
అంటే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సిన్‌ చేయగలుగుతామని, ఇదీ వాస్తవ పరిస్థితి జగన్ చెప్పుకొచ్చారు. కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలని సిఎం వైఎస్.జగన్ తెలిపారు.

latest telugu newsTelugu breaking newstelugu newsYS Jagann Mohan Reddy