వ్యవసాయం తర్వాత ఎంఎస్ఎంఈలదే: జగన్

అమరావతి: ప్రజలకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయ రంగం తర్వాత స్థానం ఎంఎస్ఎంఈ లదేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ల రెండో విడత రూ.512 కోట్ల నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడారు.

ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో దాదాపు 98వేల యూనిట్ల ద్వారా దాదాపు రూ.10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. మే నెలలో మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. చిన్న చిన్న పరిశ్రమలకు తోడుగా ఉంటేనే వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలుగుతారన్నారు. ఎంఎస్ఎంఈ ల బకాయిలన్నింటినీ క్లియర్‌ చేసినట్టు తెలిపారు. కోవిడ్‌ వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వీరికి వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.180 కోట్లు మాఫీ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వర్కింగ్‌ కేపిటల్‌ కోసం తక్కువ వడ్డీతో కేవలం రూ.6 నుంచి 8శాతంతో ఇస్తున్నట్టు తెలిపారు.

Cm Jagan mohan reddylatest telugu newsTelugu breaking newstelugu news