జగన్ బెయిల్ రద్దు కేసు మళ్లీ వాయిదా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మళ్లీ జూన్ 1కు వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలుకు జగన్ రెడ్డి, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇచ్చారు. బెయిల్ రద్దు చేయలంటూ వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది.

లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు విన్నవించారు. సిబిఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని ఆ సంస్థ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై రఘురామ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు సార్లు వాయిదా వేయించుకుని మళ్లీ వాయిదా కోరుతున్నందున ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ కొనసాగిస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.

CM YS Jagan Mohan ReddyJagan Bail revocation caselatest telugu newsTelugu breaking newstelugu news