ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పై మళ్లీ నిషేధం

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు లేకపోవడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.

కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్ డైరెక్టర్‌ సునీల్ కుమార్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకంగా అనుమతించిన వాణిజ్య విమాన సర్వీసులకు ఈ షరతులు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా కేసుల కారణంగా 2020 మార్చి 23న అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎంపిక చేసిన దేశాలకు విమానాలను నడుపుతున్నది. ఇండియా అనుమతి పొందిన కార్గొ ఆపరేషన్లు, విమానాలపై ఈ ప్రభావం ఉండదని డిజిసిఏ స్పష్టం చేసింది.

air india flightsair travellersdgca extneds suspensionindia suspendedinternational flightstouristers