టీకా వేయించుకున్న వైద్యురాలికి అస్వస్థత

ఫైజర్ టీకా వేయించుకున్న వైద్యురాలు అస్వస్థతకు గురైన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు ఫైజర్ బయోటెక్ కొవిడ్-19 టీకా తీసుకుని తీవ్ర అవస్థతకు గురైంది.

టీకా తీసుకున్న వైద్యురాలికి మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు వంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ఐసీయాలో ఉంచారు. ఈ కేసును అధ్యయనం చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. సదరు వైద్యురాలు ‘ఎన్సెఫలో మైలిటిస్’తో బాధపడుతోందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Illness to the vaccinated physicianlatest telugu newsTelugu breaking newstelugu news