కోకాపేట పై అరిస్తే పరువునష్టం వేస్తాం: తెలంగాణ సర్కార్

హైదరాబాద్: కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియపై అరిచినా, నిరాధార ఆరోపణలు చేసినా పరువు నష్టం దావా వేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. భూముల వేలం ప్రక్రియపై ఆరు పేజీలతో కూడిన సుదీర్ఘ వివరణతో ప్రకటన విడుదల చేసింది.

కోకాపేట భూముల వేలం ప్రక్రియ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, రూ.1 వేయి కోట్లు సిఎం కెసిఆర్ కుటుంబానికి ముట్టాయని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేయాలని లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రెండు ప్రాంతాల్లో వేలం పాటల్లో పోటీని నివారించామని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గించామన్న ఆరోపణలు నిరాధారమని ఖండించింది. బిడ్డింగ్ లో కొన్ని సంస్థలకే మేలు చేశామన్న ఆరోపణలు ఊహాతీతమైనవేనన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి ఆన్ లైన్ పారదర్శక వేలం పద్దతిని తప్పుపట్టడం సరికాదని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటాన్ని ఉపేక్షించబోమని, ఇకముందు ఇలాంటి కల్పి ఆరోపణలపై పరువునష్టం కేసులు వేస్తామని తెలంగాణ సర్కార్ హెచ్చరించింది.

latest telugu newsTelugu breaking newstelugu news