యూ ట్యూబర్ కు హీరో వార్నింగ్

హైదరాబాద్: ఒక యూ ట్యూబర్ అసభ్య పదజాలంతో టైటిల్ పెట్టి రిలీజు చేసిన వీడియో పై హీరో విశ్వక్ సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో పెట్టిన వ్యక్తి 24 గంటల్లో క్షమాపణలు చెబుతూ ఇంకో వీడియో పోస్టు చేయాలని, లేదంటే మీ ఇంటికి వచ్చి పెట్టిస్తానని హెచ్చరించాడు.

ఒకరి పై వీడియోలు పెట్టే ముందు, శీర్షిక పెట్టే ముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని విశ్వక్ సేన్ హితవు పలికాడు. నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న అక్షర చిత్రంలోని ఒక పాట విడుదల కార్యక్రమం ఈ మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. నందిత శ్వేత మాట్లాడుతూ, విశ్వక్ రావడం ఆనందంగా ఉందని, ధన్యవాదాలు తెలిపింది. ఈ వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ లో ఒకరు పోస్టు చేశారు. విశ్వక్ నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు… ఇచ్చాస్తానంటూ టైటిల్ పెట్టి రీలీజు చేశాడు. ఈ వీడియో హీరో విశ్వక్ దృష్టికి వెళ్లడంతో ఆగ్రహానికి లోనయ్యారు. ఈ వీడియో పై క్షమాపణ చెబుతూ మరో వీడియో విడుదల చేయాలని యూ ట్యూబర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. లేదంటే మీ ఇంటికే వచ్చి నీ సంగతి తేల్చుతానని స్పష్టం చేశాడు.

Hero Vishwak Sen.latest telugu newsTelugu breaking newstelugu news