నగరం లో దంచి కొట్టిన వాన

హైదరాబాద్: వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రవేశించింది అనే విధంగా వాతావరణం ఒక్కసారిగా మారింది.
నగరంలో తెల్లవారుజాము నుంచే వాతావరణం చల్లబడింది.
ఉదయం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మోహిదిపట్నము, టోలి చౌకి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పుర, గండిపేట్‌, శంషాబాద్‌, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, ఎంజే మార్కెట్‌, అబిడ్స్, మలక్‌పేట్‌, కొత్తపేట, వనస్థలిపురం, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్‌, కృష్ణానగర్‌, సికింద్రాబాద్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, నాగారంతోపాటు జీడిమెట్ల, సూరారం, ఈసీఐఎల్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వర్షం పడటంతో వాహనదారులు, నిత్యాసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. నగరంలో సుమారు అర గంట పాటు వర్షం కురవడం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Heavy rain in Hyderabadlatest telugu newsTelugu breaking newstelugu news