కుమారుడినే బంధించిన కర్కశ తల్లి

స్టాక్ హోమ్: కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన తల్లి కాఠిన్యాన్ని ప్రదర్శించి అమ్మతనానికే మచ్చ తెచ్చింది. 28 ఏళ్ల పాటు కుమారుడిని బంధించి హింసించడంతో పళ్లు ఊడిపోయాయి. మాట్లాడలేని దీనావస్థలో ఉన్న అతన్ని సమీప బంధువు కాపాడాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టాక్ హోమ్ లో ఏడు పదులు దాటిన మహిళ ఇంటికి సమీప బంధువు వెళ్లాడు. ఆ ఇంట్లో బందీగా ఉన్న కుమారుడిని గుర్తించాడు. వెంటనే క్షణం ఆలోచించకుండా అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి ఆసుపత్రలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. అతడి దంతాలు పూర్తిగా ఊడిపోయి ఉన్నాయి. శరీరంపై గాయాలున్నాయి. వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో తల్లిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.

కుమారుడు 12 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో ఆమె ఇంట్లో బంధించింది. ఆ తరువాత నిత్యం చిత్రహింసలకు గురిచేస్తూ, 41 సంవత్సరాలు నిండే వరకు కూడా అలాగే ప్రవర్తించింది. దంతాలను పూర్తిగా విరగ్గొట్టి మాట్లాడకుండా చేసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన మాట్లాడలేకపోతున్నాడు. సమీప బంధువు మాట్లాడుతూ, ఆమె ఇంటికి వెళ్లినప్పుడు లోపలి నుంచి దుర్వాసన రావడం చూశాను. లోపలికి వెళ్లి చూడగా భయానక పరిస్థితులు కన్పించాయి. దశాబ్ధాలుగా కుమారుడిని బంధించి హింసిస్తున్నదని గమనించాను. కాని ఇంత తీవ్ర స్థాయిలో ఉంటుందని ఎప్పుడు ఊహించలేదన్నారు. తనకు అతని దీనస్థితిని చూసి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుని కాపాడానని, ఇప్పుడు ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.

latest telugu newsTelugu breaking newstelugu news