కేసీఆర్ సభలో కన్పించని హరీశ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఆర్థిక శాఖ మంత్రి, మేనల్లుడు టి.హరీశ్ రావు కన్పించలేదు. ఈయనతో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి కూడా రాలేదు.

దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి తరువాత హరీశ్ రావు ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారనే విమర్శలు నిజమయ్యేలా పరిణామాలు ఉన్నాయి. ఆయన గ్రేటర్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో ఉన్నప్పటికీ, ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు రాకపోవడం కార్యకర్తలు చర్చించుకున్నారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా 130వ డివిజన్ కార్యకర్తలు బ్యానర్ ప్రదర్శించారు. మన పదవులు మనకే, మన పాలన మనకే అన్నావు, 130వ డివిజన్ టిక్కెట్ తెలంగాణేతరుడికి ఇచ్చావు అంటూ బ్యానర్ చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ఇది చూసిన పోలీసులు వెంటనే వారిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించారు.

కేసీఆర్ ప్రసంగిస్తుండగానే పలువురు సభా ప్రాంగణం వదిలి ఇంటిముఖం పట్టారు. చప్పగా సాగిన సభలో కార్యకర్తలు కాని ప్రజలు కాని కేసీఆర్ ప్రసంగానికి చప్పట్లు కొట్టలేదు. సభికుల నుంచి స్పందన లేకపోవడంతో వేదికపై ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు.

latest telugu newsTelugu breaking newstelugu news