సమాచారం ఇచ్చిన వారిపైనే వేధింపులా?: లోకేష్

అమరావతి: ఏపీలో దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగంగా పెట్టుకున్నారంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.

‘‘నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత. ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారం పై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టి వేధించడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట. రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసుల పై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టుల పై అక్రమ కేసులు బనాయిస్తుంది.’’ అంటూ ట్వీట్ చేశారు.

Aplatest news in telugunara lokesh comentstdpTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu