రహస్య వీడియోలతో యువతికి వేధింపులు

హైదరాబాద్: ఓ యువతి రహస్య వీడియాలతో ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తారానగర్‌కు చెందిన అస్లమ్‌ఖాన్‌(24) అనే యువకుడు రహ్మత్‌నగర్‌ కు చెందిన ఓ యువతిని ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు.

ప్రేమ పేరుతో ఇద్దరు శారీరకంగా కూడా కలిశారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా తీసుకున్నారు. సదరు యువతితో పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఇటీవల తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకునేందుకు యువతి సిద్ధమవగా.. రహస్య వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ వేదించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

blackmail casebreaking news in telugucrimehyderabadlatest news in teluguTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu