తుది దశకు గ్రేటర్ ఫలితాలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకున్నది. మరో గంటలో పూర్తి స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల వరకు 132 స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లు వెల్లడించారు.

టీఆర్ఎస్ పార్టీ 53 స్థానాలు, బీజేపీ 35, ఎంఐఎం 42, కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఇంకా ప్రకటించాల్సిన స్థానాలు 18 వరకు ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా టీఆర్ఎస్ అవతరించనున్నది.

ap latest newsGHMC electionsgreater hyderabad divisionsgreater hyderabad resultstelangana latest news