గ్రేటర్ హంగ్ ఫలితాలు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఫలితాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్ కు తలనొప్పిగా పరిణమించాయి.

మజ్లిస్ పార్టీతో తమకెలాంటి దోస్తానా లేదని, ఆ పార్టీ వేరు, మేము వేరని ఇన్నాళ్లు చెప్పిన టీఆర్ఎస్ ఏం చేస్తారనేది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ్టి ఫలితాల్లో టీఆర్ఎస్ కు 56 సీట్లు, బీజేపీకి 46, ఎంఐఎం పార్టీకు 43, కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. మేయర్ అభ్యర్థిగా ఎవరైనా నిల్చోవాలంటే మెజారిటీ సీట్లను గెలుపొందాల్సి ఉంటుంది. మొత్తం 150 డివిజన్లలో 76 డివిజన్లను గెలుచుకుంటే తప్ప మేయర్ సీటు దక్కదు. కాని ఒక్క పార్టీ కూడా 60 సీట్లను మించి గెలుపొందలేదు. టీఆర్ఎస్ మాత్రం ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఈ పరిస్థితుల్లో మజ్లిస్ మద్దతు తీసుకుంటే తప్ప టీఆర్ఎస్ మేయర్ సీటును కైవసం చేసుకునే అవకాశాలు లేవు.

ghmc hung resultsghmc latest newsghmc mayor candidatemajlis partyshock o trsTelugu breaking news