ఫ్రంట్ వారియర్స్ కే ప్రథమ ప్రాధాన్యం

ఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలి దశంలో ఫ్రంట్ వారియర్స్ కు ఇప్పంచాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా పోరులో ముందున్న వారికే తమ ప్రాధాన్యమని వెల్లడించింది.

ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోంది. దేశంలోని 92 శాతం ప్రభుత్వ ఆసుపత్రులు, 55 శాతం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సమాచారం సేకరించారు. తొలి దశలో సుమారు ఒక కోటి మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. వీరిలో నర్సులు, ఆశా వర్కర్లు, మెడికల కాలేజీలు, వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, డాయగ్నస్టిక్ సిబ్బంది ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ప్రదాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ తరువాత కరోనా ముప్పు అధికంగా ఉన్నవారి తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని తెలిపారు. ఇలా మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు.

latest telugu newsTelugu breaking newstelugu news