మాజీ మంత్రి భార్య దౌర్జన్యం.. పోలీసు కేసు

హైదరాబాద్: ఏపి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ మనుషులు జూబ్లిహిల్స్ లో దౌర్జన్యానికి దిగారు. హౌసింగ్ సొసైటికి చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు అయ్యింది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన సర్వేనంబర్ 853ఎఫ్ కు చెందిన 1519 గజాల స్థలంపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఆ స్థలం తమదేనంటూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య వాదిస్తున్నారు. ఆ భూమిలోకి ప్రవేశించి నానా హంగామా చేశారంటూ నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది. స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని… వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో కోరింది. ఆ స్థలంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారు. భూమిని అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Former AP Minister Pratipati Pulla Raolatest telugu newsTelugu breaking newstelugu news