అంజనేయుడి దయతో ప్రమాదం తప్పింది: కమల్ నాథ్

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ లిప్టులో నుంచి కింద పడిపోయాడు. అదృష్ణవశాత్తు ఆయనకు ఏమీ కాలేదు. ఆంజనేయుడి దయ వల్ల ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, హనుమంతుడి దయ నా మీద ఎప్పుడూ ఉంటుందని కమల్ నాథ్ తెలిపారు.

ఈ విషయం తెలియగానే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కమల్ నాథ్ కు ఫోన్ చేసి వాకబు చేశారు. ఏమీ కాలేదని తెలియచేయడంతో చౌహాన్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆదివారం ఇండోర్ లోని డీఎన్ఎస్ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక పేషంట్ ను పరామర్శించేందుకు కమల్ నాథ్ వెళ్లారు. ఆయన వెంటన సజ్జన్ సింగ్ వర్మ, జితు పట్వారీ, విశాల్ పటేల్, వినయ్ బకాలివాల్ ఉన్నారు. అందరూ కలిసి లిఫ్టులో ఎక్కిన కొద్ది సేపటికే ఫస్ట్ ఫ్లోర్ కు పడిపయింది. బయటకు వచ్చేందుకు వీలు లేకుండా డోర్స్ మూతపడ్డాయి. సెక్యురిటీ సిబ్బంది హుటాహుటిన వచ్చి డోర్స్ తెరిచి లోపల ఉన్నవారిని రక్షించారు. లిప్టులో సుమారు పది మంది ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఓవర్ లోడ్ కారణంగానే లిఫ్టు పడిపోయిందని అంటున్నారు.

latest telugu newsMadhya Pradesh Former Chief Minister Kamal NathTelugu breaking newstelugu news