ఉత్తరాంధ్ర ఆస్తిత్వానికి ముప్పొచ్చింది…

యుపీఎస్సీ పూర్వ ఛైర్మన్ ఆచార్య కె యస్.చలం

విశాఖపట్నం: ఇక్కడ కట్టు బొట్టు మాటకు విలువ లేకుండా పోతున్నదని, ఉత్తరాంధ్ర ఆస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ కెఎస్.చలం ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ స్టీలు ప్లాంట్ కోసం ఆనాడు భూములు ఇచ్చిన వేలాది మంది రైతు కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందని చలం ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కు భుములిచ్చిన స్థానికుల అమాయకత్వం, ఆకలితో ఆర్ కార్డులు అమ్ముకునేట్లు చేశారని ఆయన ఆరోపించారు. ఆ విధంగా చాలా మంది మిగతా జిల్లాల వారు యిక్కడకు చేరారన్నారు. 1990 నాటికి మన వారి ఆర్థిక , విద్యా పరిస్థితి బాగో లేవన్నారు. స్టీల్ ప్లాంట్ కాదు మిగతా సంస్థల్లో క్లాస్ 4 ఉద్యోగాలు దొరికి తే చేరారు. పొట్ట చేత్తో పట్టుకొని వైజాగ్ చేరుకున్న కుటుంబాలు యింటి పని, తాపీ పనిలో కుదురుకుని గాలి పీల్చుకుంటూ బ్రతికేస్తూ ప్రభుత్వ మిచ్చే బియ్యం సహాయాలు చూసి చాల్లే అనుకుంటున్నారని చలం ఆందోళన వ్యక్తం చేశారు.

మన అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని రెచ్చి పోతున్న మిగతా ప్రాంతాల  నాయకులు స్థానికులకు తాయిలాలు యిచ్చి తాబేదార్ల గా చెరదీస్తున్నారన్నారిని ఘాటుగా విమర్శించారు. వారికి జీ హుజూర్ అని కల్మొక్కించుకుని  అవమానకరంగా చూస్తున్నారన్నారు. స్థానిక భాష, సంస్కృతి ని హేళన చేస్తూన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చివరకు ప్రజల ఆస్తులు, స్టీల్ ప్లాంట్ తో సహా  సముద్ర తూర్పు తీరాన్ని ,అరకు వరకు కొండల్ని చుట్టేయడానికి ప్రణాళికలు చేశారని జనం అనుకుంటున్నారు. యిక్కడ రాజకీయ పార్టీలకతీతంగా అంతా అక్కడి వారే ఉన్నారని చలం అన్నారు.

యిప్పుడు స్టీల్ ప్లాంట్ తో పాటు మన స్థిరాస్తులను, భూములను కాపాడు కోవాలన్నారు. అందుకు యువకులు కాసేపు మొబైల్ పక్కన పెట్టి భవిష్యత్ ఆలోచించండని ఆయన హితవు పలికారు. పదేళ్ల తరువాత  తుర్పోల్లు అంటే మనల్ని తన్ని కూర్చో బెడతారు. మన మాటను, పాటను, తిండిని మన యింట్లోనే వెలాకొళం చేసి మధ్య యుగాలకు పంపిస్తారని ఆయన హెచ్చరించారు. యిప్పుడు నడుస్తున్న చరిత్ర ఏమిటంటే కప్పం కట్టే సామంతుల కోసం వెతుకులాట. స్థానికుడు పక్క ప్రాంతం వాడికి ,రాష్ట్రం, కేంద్రానికి కప్పం కట్టే పరిస్థితి ఏర్పడిందని చలం ఆరోపించారు. సెటిలర్స్ తో బహుపరాక్ అని చలం పిలుపునిచ్చారు.

Former chairman of UPSC Professor KS Chalamlatest telugu newsTelugu breaking newstelugu news