బీజేపీలోకి ఐదుగురు ఎంపీలు

కోలకత్తా: అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీఎంసీ అధినేత కు చరుకు తగిలేలా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతున్నది. త్వరలోనే ఐదుగురు టీఎంసీ ఎంపీలు పార్టీలోకి మారుతున్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు.
ఎంపీలు సౌగత్ రాయ్ సహా ఐదుగురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని ఆయన వెల్లడించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఉత్తర పరగణాల జిల్లాలో శనివారం ఒక పూజా కార్యక్రమంలోపాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదుగురు ఎంపీలు టీఎంసీకి రాజీనామా చేస్తున్నారు, వారు ఏ క్షణాన్నైనా మా పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు.

బెంగాల్ రవాణా శాఖ మంత్రి సువెందు అధికారిని సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కోసం పక్కన పెట్టిందని ఆయన చెప్పారు. ఏ నాయకుడు కూడా ఇలాంటి చర్యలను ఉపేక్షించరని, సువెందును అవమానిస్తున్నారని, ఆయన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అర్జున్ సింగ్ తెలిపారు.

latest telugu newsTelugu breaking newstelugu news