మహరాష్ట్ర లో ఎన్ కౌంటర్ లో ఐదుగురు మృతి

ముంబయి: గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.

ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఇవాళ తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. కొంత మందికి తీవ్ర గాయాలతో ఘటనా ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి కూంబీంగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్న వారి కోసం గాలింపు జరుగుతోందని, అక్కడున్న వారందరిని పట్టుకునే వరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ తో ఆ ప్రాంతం అంతా భీతావహంగా మారింది.

crime newsencounter in MaharashtraFive killed in encounterFive killed in encounter in Maharashtralatest telugu newsTelugu breaking newstelugu news