ఆక్సిజన్ లేక ఐదుగురు మృతి

భోపాల్: దేశంలో కరోనా వైరస్ కు చికిత్స సరిగ్గా దొరక్క ఇప్పటికే పలువురు చనిపోతుండగా ఆక్సిజన్ లభ్యం కాక కూడా చనిపోయేవారు పెరుగుతున్నారు. షాదోల్ జిల్లాలని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు చనిపోయారు.

తమవాళ్లు సకాలంలో ఆక్సిజన్ లభ్యంకాక చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. కరోనా వచ్చిన తరువాత కొందరికి ఊపిరితిత్తుల్లో సమస్య వస్తున్నది. వీరికి వెంటనే ఆక్సిజన్ సమకూర్చనట్లయితే ఊపిరి తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడి చనిపోతున్నారు. ఆక్సిజన్ లేక చనిపోలేదని, కరోనా తో చనిపోయారని ఆసుపత్రి యాజమాన్యం వింతగా వాదిస్తున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 11269 పాజిటివ్ కేసులు రాగా 66 మంది ప్రాణాలు విడిచారు.

Five died of oxygen deprivationlatest telugu newsTelugu breaking newstelugu news