తొలిసారి 3,689 మంది మృతి

న్యూఢిల్లీ: అమెరికా దేశం కన్నా వేగంగా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 3,92,488 మందికి పాజిటివ్‌ నిర్థరణ కాగా 3,689 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

గతం రోజుతో పోల్చితే శనివారం నాడు పరీక్షలు తగ్గించడంతో కేసులు కూడా తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసులు 1.95 కోట్లు కాగా కోలుకున్న వారు 1.59 కోట్లు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 33,39,644 ఉన్నాయి. శనివారం తొలిసారిగా 3.689 మంది పాజిటివ్ సోకినవారు చనిపోయారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 2,15,542 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా శనివారం నాడు 18.26 లక్షల మందికి మాత్రమే డొసులు ఇచ్చారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇవ్వాలని కేంద్రం ఆదేశించినప్పటికీ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

corona deaths in indiaCorona positive cases in Indialatest telugu newsTelugu breaking newstelugu news