లాకప్ డెత్ కేసులో ఎస్సై, కానిస్టేబుళ్లు డిస్మిస్

హైదరాబాద్: దళిత వృద్దురాలు మరియమ్మ లాకప్ డెత్, ఆమె కుమారుడిని తీవ్రంగా హింసించిన కేసులో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తీవ్రమైన చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దళితులపై దాడి చేసిన వారిలో చర్యలు తీసుకోవడంలో ఇదే మొదటిసారి. గతంలో సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో దళితులపై అమానుషంగా దాడులు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యాదాద్రి జిల్లా అడ్డగూడురు పోలీసు స్టేషన్ లో మరియమ్మ పోలీసు కస్టడిలో మృతి చెందింది.

ఈమె కుమారుడిని కూడా తీసుకువచ్చి తీవ్రంగా హింసించడంతో అతను ఇప్పటి వరకు కోలుకోలేదు. ఈ ఘటనపై సిఎం కెసిఆర్ సీరియస్ కావడంతో పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఇంతకు ముందు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసిన రాచకొండ కమిషనర్ తాజాగా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన ఎస్సై వి.మహేశ్వర్, కానిస్టేబుళ్లు ఎంఎ.రషీద్ పటేల్, పి.జానయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు చేశారు.

Telugu breaking newsTelugu latest newstelugu news