ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలి: ఎమ్మెల్సీ అశోక్

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో నేటిరోజు అత్యంత దురదృష్టకరమైనదని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపి సచివాలయంలో నలుగురు కరోనాతో మరణించడం అత్యంత బాధాకరమన్నారు.

ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశంకల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్  పంపిణీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు ప్రజలకు చేర్చడంలో కీలకమైన అన్నిశాఖల ఉద్యోగులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. పిపిఈ కిట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని, మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబాలకు వర్తించే ప్రయోజనాలను ఉద్యోగుల కుటుంబాలకు వర్తింపచేయాలని కోరారు. ప్రభుత్వ అలసత్వం వివిధశాఖల ఉద్యోగులకు ప్రాణాంతకంగా మారకూడదు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు.

ap employeesap latest newscm jagan reddycorona deathscovid deathsmlc asok babu