ఆరు ఎమ్మెల్సీ సీట్లకు ఈసీ షెడ్యూల్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల చేసింది. ఈ ఆరు స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 4 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా 5 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 8న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. మార్చి 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటంది.

సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. మార్చి 29వ తేదీతో నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ సీట్లతో మరో రెండు సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తిప్పే స్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి, మహ్మద్ ఇక్బాల్ పదవీకాలం 29వ తేదీతో పూర్తి అవుతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. ఆయనను రాజ్యసభ సభ్యుడిగా పంపించార. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతితో మరొకటి ఖాళీ అయింది. మొత్తం ఖాళీగా ఉణ్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Central Election CommissionEC schedule for six MLC seatslatest telugu newsTelugu breaking newstelugu news