డాక్టర్ చీటి లేకుండా మందులు ఇవ్వొద్దు…

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ షాపులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో గత రెండు వారాలుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

దగ్గు, జ్వరం కోసం మందుల కోసం వచ్చే వారికి వైద్యుల చీటి లేకుండా మందులు ఇవ్వొద్దని మెడికల్ షాపు యజమానులకు స్పష్టం చేసింది. అదే విధంగా నో మాస్క్ నో మెడిసిన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ఉంటేనే మందులు ఇవ్వాలని పేర్కొంది. గతేడాది కరోనా ప్రారంభ సమయంలో ఇదే విధానాన్ని అమలు చేశారు.

corona second waveCovid Pandemicdoctor's prescriptionmedical shopstelangana health department