ముగ్గురి వైసీపీ నేతలకు జిల్లా బాధ్యతలు

తాడేపల్లి: వైసీపీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు.

రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను, వైవీ. సుబ్బారెడ్డి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను, సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
అలాగే తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి నిర్ణయించారు.

Ap political newsCm Jaganmohan reddylatest telugu newsTelugu breaking newstelugu news