లాక్ డౌన్ ఎత్తేయగానే జావా డెలివరీలు

ముంబయి: ఒకప్పటి జావా టూ వీలర్ లో కొద్దిగా మార్పులు చేసిన ప్రస్తుత తరానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మోడళ్లను చూసిన పలువురు ఆకర్షితులు అయి బుక్ చేసుకున్నారు.

కరోనా మహమ్మారితో దేశంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత బుకింగ్ చేసుకున్న వారికి వాహనాలను డెలివరి చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జావా 42 స్పోర్ట్స్ స్ట్రిప్ మోడల్ ను విడుదల చేయగా మంచి డిమాండ్ వచ్చింది. జావా బండ్లకు వచ్చే బుకింగ్స్ లో ఇవే 50 శాతం వరకు ఉన్నాయి. మిగతా రెండు రంగులు 50 శాతం వరకు ఉన్నాయి. మహీంద్రాకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ సంస్థ దేశ వ్యాప్తంగా జావా డీలర్ షిప్ లను విస్తరించనున్నది. రానున్న ఆగస్టు నాటికి 150 పట్టణాల్లో 175 డీలర్లను నియమించుకుంటున్నది. ఆ తరువాత వీటి సంఖ్యను 275కు పెంచనున్నారు. రానున్న ఏడాది కాలంలో 500 డీలర్ షిప్ ల లక్ష్యం పూర్తి చేయాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

classic legendsjawa bikesjawa two wheelersmaheendra grouptelugu update news