ఐదు రాష్ట్రాల ఎన్నికలపై నేడు నిర్ణయం

న్యూఢిల్లీ: నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) కీలక సమావేశం నిర్వహించనున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు చేయనున్నది.
మార్చి మొదటివారంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలను మొదటి వారం లోపు ప్రకటించే సూచనలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో వెల్లడించారు.

అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు తేదీలు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించి నివేదిక అందచేశారు.

Decision today on five state electionslatest telugu newsTelugu breaking newstelugu news