ఫ్లిప్ కార్ట్ లో కొవిసెల్ఫ్ కిట్ లు

ముంబయి: మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా ఉన్న మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన కరోనా స్వీయ పరీక్ష కిట్లు ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానున్నాయి.

దీంతో పాటు మెడికల్ షాపుల్లో రెండు మూడు రోజుల్లో అందుబాటులో పెట్టాలని మై ల్యాబ్ నిర్ణయించింది. ఇంట్లోనే స్వయంగా పరీక్షించుకునేందుకు, డయాగ్నస్టిక్ ల్యాబ్ వెళ్లే అవసరం లేకుండా ఈ కిట్ ను అభివృద్ధి చేశారు. ఒక్కో కిట్ ధర ను రూ.250గా నిర్ణయించారు. ఈ సెల్ఫ్ టెస్టు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ ద్వారా కేవలం పావుగంట వ్యవధిలో కరోనా సోకిందా లేదా అనేది వెల్లడి అవుతుంది. గత నెలలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతించింది. ముక్కులో నుంచి స్వాబ్ సేకరించడం మొదలు ఎలా పరీక్షంచుకోవాలనేది పూర్తి వివరాలు అందులో పెట్టారు. టెస్టు వివరాలు కూడా ఆన్ లైన్ లో నమోదు అయ్యేలా ఏర్పాటు చేసి, ఐసిఎంఆర్ పోర్టల్ కు లింక్ కూడా చేశారు.

తొలుత పది మిలియన్ కిట్లను పలు నగరాలకు పంపించారు. ప్రతి వారం ఏడు మిలియన్ టెస్టు కిట్ లను విక్రయించేందుకు మై ల్యాబ్ ఏర్పాట్లు చేసుకున్నది. ల్యాబులు అందుబాటులో లేని ప్రాంతాలు, గ్రామీణులు, ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు, ల్యాబ్ లకు వెళ్లి క్యూ లో నిల్చునే బదులు ఇంటి వద్దే పరీక్షించుకునేందుకు ఈ కిట్ ను తయారు చేశారు.

Coviself kitsCoviself kits in the flip cartlatest telugu newsMy Lab Discovery SolutionsTelugu breaking newstelugu news