టీటీడీలో 80మంది సిబ్బందికి కరోనా

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా మీడియాకు తెలిపారు.

లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరుమల వెంకన్న ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. తొలుత ఐదారు వేల మందికే అనుమతించిన దేవస్థనం ఆ తరువాత రోజూ పదివేల మందికి పైగా భక్తులను అనుమతిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు టీటీడీ సిబ్బంది కరోనా బారినపడ్డారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
నిత్యం 200 మంది అనుమానిత టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 80 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్‌ సోకినట్లు సమాచారం లేదన్నారు. ఇప్పటి వరకు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వివరించారు.

Corona to 80 staff at TTDlatest telugu newsTelugu breaking newstelugu newstirumala tirupathiTTD staff are infected with corona