భారత్ లో కరోనా విలయతాండవం

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544 కు చేరింది.

ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 3,79,892 కు చేరింది. దీంతో దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,27,439 కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 18,213 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి.

corona deathscorona heavy spreads on indiacorona positives in indiacorona updateslatest telugu newsTelugu breaking newstelugu news