కరోనా ఎఫెక్ట్… గర్భం దాల్చవచ్చా!?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ముఖ్యంగా మహిళలు, గర్భవతుల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ సమయంలో గర్భం దాల్చవచ్చా, గర్భవతులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించడంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీనికి సంబంధించి గైనిక్ డాక్టర్లు అపోహలు నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత హాయిగా భార్యా, భర్తలు కలవచ్చని అంటున్నారు. 4-6 నెలల గర్భంతో ఉన్నవారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని స్పష్టం చేశారు. కొందరు తెలియక వేసుకున్నా వచ్చే ఇబ్బంది లేదు. అయితే వ్యాక్సిన్ తీసుకునే ముందు గర్భవతులు, మహిళలు గైనిక్ డాక్టర్ ను కలవాలంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ముప్పు లేదు. భార్యా, భార్తలకు కూడా ఎలాంటి సమస్య ఉండదని గైనిక్ డాక్టర్లు చెబుతున్నారు.

latest telugu newstelugu breakingtelugu news