డీఎంకె కు కాంగ్రెస్ గుడ్ బై?

హైదరాబాద్: గత రెండు దశాబ్ధాలుగా మిత్రపక్షంగా వ్యవహరించిన రెండు సెక్యులర్ పార్టీల మధ్య భేధాభిప్రాయాలు వచ్చాయి. ఇప్పటికే ఎఐఏడీఎంకె-బీజేపీ పార్టీలు పొత్తులు కుదుర్చుకుని ముందుకు వెళ్తుండగా ఇంకా కాంగ్రెస్-డీఎంకె కూటమి సీట్ల లొల్లిలో తలమునకలై ఉన్నాయి.

సీట్ల సర్థుబాటులో సయోధ్య కుదరకపోవడంతో తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిఎంకె కు దాదాపుగా గుడ్ బై చెప్పేసింది. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. గత అసెంబ్లీలో కేటాయించిన విధంగానే ఈసారి కూడా 41 సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇందుకు డీఎంకె ససేమిరా అంటోంది. 41 సీట్లలో 8 సీట్లు మాత్రమే గెలుపొందడం మూలంగా అధికారం కోల్పోయాని, ఈసారి అలా జరగనివ్వమని డీఎంకె తేల్చి చెప్పడంతో పంచాయతీ ముదిరింది. ప్రస్తుతం 18 సీట్లకు మించి ఇవ్వలేమని, ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోవాలని కాంగ్రెస్ కు ఆల్టిమేటం ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని ఐ ప్యాక్ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడి కావడంతో డీఎంకె పట్టుదలతో ఉంది. 30 సీట్లు ఇస్తే సరి లేదంటే హీరో కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తుకు వెళ్దామని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేశాయి.

డీఎంకె తో బీజేపీ అంతర్గతంగా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నదని, అందుకే తక్కువ సీట్లు ఇస్తామంటూ బేరమాడుతోందని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. పుదుచ్చేరిలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా రాహుల్ కు వివరించడంతో ఆయన కూడా పునరాలోచనలో పడ్డారు. డీఎంకె కు కటిఫ్ చెప్పి కమల్ హాసన్ పార్టీతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ శనివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

AIADMK-BJP partiescongress leader rahul gandhilatest telugu newsState Congress Party DMKtelugu brweaking newstelugu news