కెఓఎల్ ఆస్తుల జప్తు: ఈడీ

హైదరాబాద్: క్యోరీ ఓరెమిన్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషూ నారంగ్ ఆస్తులు అటాచ్ అయ్యాయి. రూ.51.40కోట్ల విలువ చేసే ఇషూ నారంగ్, కేఓఎల్ ఆస్తులను ఈడీ  అటాచ్ చేసింది.

ఏపీలోని విజయనగరం జిల్లా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లోని 17 ఆస్తులు తాత్కాలికంగా జప్తు చేశారు. కేఓఎల్ ప్రమోటర్లు బ్యాంకులను మోసం చేశారని అభియోగం నమోదు అయ్యింది. వివిధ బ్యాంకులకు సుమారు రూ.180 కోట్ల నష్టం చేశారని ఈడీ తెలిపింది. రుణం ద్వారా సేకరించిన డబ్బులో రూ.100 కోట్లు బోగస్ సంస్థల ద్వారా ఇతరులకు మళ్లించారని ఈడీ పేర్కొంది.

 

bank loans fraudDirectorate of Enforcementhyderabad ed officekol assets siezednational banks complientproperties attached