మంత్రి శ్రీనివాస్ పై హెచ్ఆర్సీ లో ఫిర్యాదు

హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు వి.శ్రీకాంత్ గౌడ్ కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ మార్చి 15వ తేదీ లోపు నివేదిక ఇవ్వాల్సిందిగా డీజీపీ, మహబూబ్ నగర్ పోలీసు సూపరింటెండెంట్ ను ఆదేశించింది.

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ భూ ఆక్రమణలను ప్రశ్నిస్తున్న తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ పలువురు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. బీసీ నాయకుడనని చెప్పుకుంటున్న శ్రీనివాస్ బీసీలమైన మాపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదు లో తెలిపారు. ముదిరాజ్ కులాన్ని దూషించిన శ్రీనివాస్ గౌడ్ ను తాము వ్యతిరేకించడం మూలంగానే తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వారు ఆరోపించారు. మంత్రి అనుచరులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని తెలిపారు.

రాత్రంతా పోలీసు స్టేషన్ లో పెట్టి హింసలకు గురి చేస్తున్నారని, పోలీసులు మంత్రి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తమ ఫిర్యాదులో వివరించారు. అడ్డొచ్చిన మహిళలను కూడా దర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ టౌన్ 1, టౌన్ 2 పోలీసు స్టేషన్ ఎస్సైలు, మహబూబ్ నగర్ రూరల్ పోలీసు స్టేషన్, మహాబుబ్ నగర్ సిఐ, డిఎస్పి లు మంత్రికి ఏజెంట్లుగా పని చేస్తున్నారని తెలిపారు.

Excise Minister V. Srinivas Gowdahuman rights commissionlatest telugu newsTelugu breaking newstelugu news