తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

హైదరాబాద్: చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన యూ ట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పై  సైబర్ క్రైం లో టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పిర్యాదు చేసింది.

సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీసుస్టేషన్ లో ఒక కేసు దర్యాప్తు జరుగుతున్నా రాష్ట్ర పోలీసుల పై, రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తూన్నాడన్నారు. యూట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని వార్తలు చదువుతున్నాడా, తిట్లు చదువుతున్నాడా అని ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై పదే పదే చేసే అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. తెలంగాణను అఫ్ఘనిస్తాన్ దేశంతో పోల్చడం ఏంటని, నీకు ఇంత స్వేచ్చా ఉంటుందా అన్నారు. చింతపండు నవీన్ పై సిసిఎస్ సైబర్ క్రైం లో టిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వినర్లు క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్మోహన్ రావు ఫిర్యాదు చేశారు.

ccs cyber crime stationchinthapandu naveen kumarhyderabad policeteenamar mallannatelangana policeTelugu breaking newstrs scocial mediayoutube channel