ఆగస్టు 3 నుంచి కాలేజీలు ప్రారంభం

అమరావతి: ఆగస్టు నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభించాలని ఏపీ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కాలేజీలను నడిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని, మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది.
196 పనిదినాలు అమలు చేయడంతో పాటు 30 శాతం సిలబస్ తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని, ఆన్ లైన్ పాఠాల నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది. గత విద్యా సంవత్సరం మాదిరి పండగ సెలవులు ఈ ఏడాది ఉండవు.

ఇక ప్రతి సబ్జెక్టుకూ ఒక వర్క్ బుక్ ను ప్రత్యేకంగా ఇవ్వనున్నామని, జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని తెలియజేసింది. యధావిధిగా మార్చిలోనే వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Colleges start from apColleges start from Augustlatest telugu newsTelugu breaking newstelugu news