రెండు వర్గాల మధ్య ఘర్షణ.. మహిళ మృతి

గుంటూరు : రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలోని వెలగపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరియమ్మ అనే మహిళ(50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. ఘర్షణ చోటుచేసుకున్న ప్రాంతంలో పోలీసులు పికెట్ విధించారు.

crime newslatest telugu newsTelugu breaking newstelugu newsWoman killed