సిఎం కూర్చీ కోసం ముగ్గురు పోటీ: చింతా మోహన్

తిరుపతి: ఏపి సిఎం వైఎస్.జగన్ జైలుకు వెళ్తే ఆ కుర్చీ కోసం ఆ ముగ్గురు నాయకులు ఆశపడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా నుంచి ఒక పెద్ద నాయకుడు, విజయ నగరం నుంచి మరో నాయకుడు, వెంకటగిరి నుంచి ఇంకొక నేత ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్రంలో రహస్య మంతనాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుపతి సభకు రావడానికి సిఎం జగన్మోహన్ రెడ్డికి కరోనా భయం కాదని, సిఎం కుర్చీ భయం పట్టుకుందన్నారు. అందుకే తిరుపతి పర్యటనను జగన్ రద్దు చేసుకున్నాడని చింతా మోహన్ అన్నారు.

కరోనా తో సహజీవం తప్పదు అని గతంలో మాట్లాడిన జగన్, నేడు తిరుపతి పర్యటన రద్దుకు కరోనా సాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు విచ్చల విడిగా తిరుపతి లోక్ సభ ఎన్నికలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. రెండు పార్టీలు డబ్బు సంచులు పంచేందుకు సిద్దంగా తిరుపతి లో ఉన్నాయని అన్నారు. ఎన్నికల అధికారులు వైసిపి ప్రలోభాలను, దౌర్జన్యాలు, దబాయింపులను అరికట్టడంలో విఫలమైందని చింతా మోహన్ ఆరోపించారు.
రాష్టంలో మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎప్పుడు వస్తుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరులో ధర్మమే గెలుస్తుందన్నారు. ఊహించని విధంగా తిరుపతి పార్లమెంట్ ఫలితం వస్తుందన్నారు. తిరుపతి పార్లమెంట్ గడ్డపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు.

Chinta MohanFormer Union Minister Dr. Chintamohanlatest telugu newsTelugu breaking newstelugu news